మళ్ళీ జగన్ గెలిస్తే.. మిమ్మల్ని కూడా..- చంద్రబాబు వార్నింగ్

నేను ఎప్పుడూ సీటు మార్చలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ని మార్చాలి.

మళ్ళీ జగన్ గెలిస్తే.. మిమ్మల్ని కూడా..- చంద్రబాబు వార్నింగ్

Chandrababu Naidu Slams CM Jagan In Tuni (Photo : Google)

Updated On : January 10, 2024 / 10:06 PM IST

Chandrababu Naidu : కాకినాడ జిల్లా తునిలో రా కదిలి రా బహిరంగ సభలో ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మళ్లీ జగన్ గెలిస్తే మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టుకుంటారు అని చంద్రబాబు హెచ్చరించారు.

‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆటో సోదరులకు ప్రత్యేకమైన కార్యక్రమం చేపడతాను. వెనకబడిన వర్గాలకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తాము. దళిత డ్రైవర్ ను చంపిన వ్యక్తిని జైలు నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి పక్కన కూర్చోపెట్టుకున్న సిగ్గు లేని సీఎం.

Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్

”పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. కాపులకు 10వేల కోట్ల కార్పొరేషన్ ఇవ్వలేదు. బాబాయ్ ని చంపి ఆ గొడ్డలి మన మీద వేద్దామని ప్రయత్నం చేశారు. దేశంలోనే అత్యంత ఆస్తులు ఉన్న సీఎం జగన్. రాష్ట్రంలోనే పెద్ద పెత్తందారుడు జగన్. ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చారు. ఆ తప్పులు చేయడానికి కారణం మీరు కాదా? ఈ ప్రాంతంలో మంత్రి వసూల్ రాజా. ఆయన అక్రమాలకు అంతేలేదు.

బియ్యం దందాకి కాకినాడ ద్వారంపూడి ద్వారాలు తెరిచారు. ఎంత మెక్కారో అంతా కక్కించే బాధ్యత తీసుకుంటాను. ఈ జిల్లాలో ఎక్కడి నుంచో వచ్చి పెత్తనం చేస్తున్నారు. ఇక్కడ నాయకులు లేరా? ఎక్కడి నుండో వచ్చి పెత్తనం చెయ్యాలా? సామాజిక వర్గాన్ని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మంత్రి పదవి సంపాదించారు. కాకినాడ రూరల్ లో మాజీమంత్రి తెలివైన వాడు. జగన్ ని తిట్టిన నోరుతోనే పొగుడుతాడు. నేను ఎప్పుడూ సీటు మార్చలేదు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ని మార్చాలి. అమరావతే రాజధానిగా ఉంటుంది. మత్స్యకారులు ఉండే పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలను నిర్మూలించే కార్యక్రమాలను చేపడతాం” అని చంద్రబాబు చెప్పారు.

Also Read : సంపదంతా వాళ్ల చేతుల్లోకే వెళ్తుంది..! ప్రస్తుత రాజకీయాలపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు