Nimmala Rama Naidu: ఏపీలో ఏ అంటే అమరావతి.. ఇక పీ అంటే..: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.

Nimmala Rama Naidu: ఏపీలో ఏ అంటే అమరావతి.. ఇక పీ అంటే..: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu

Updated On : June 24, 2023 / 8:20 PM IST

Nimmala Rama Naidu – TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలూరులో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రలో ఆయన మాట్లాడారు.

చంద్రబాబు నాయుడి హయాంలో ఏపీలో ఏ అంటే అమరావతి (Amaravati) అని, పీ అంటే పోలవరం (Polavaram) అని నిమ్మల రామానాయుడు అన్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సిందేనని తెలిపారు.

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 72 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో కేవలం 2 శాతం మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. సామాన్యులకు కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పుడు అనుమతుల పేరుతో పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లకుండా వైసీపీ అడ్డుకోవడం సిగ్గు చేటని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేస్తామని నాడు అసెంబ్లీలో చెప్పి ఇప్పుడు వైసీపీ మాట మార్చిందని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్ 2022లో వచ్చిన వరదలు వల్లే దెబ్బ తిందని కేంద్ర నిపుణులు తేల్చారని తెలిపారు. కనీస అవగాహనలేని వారు మంత్రులుగా కొనసాగుతున్నారని అన్నారు.

Seediri Appalaraju: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సెంటు కొట్టుకుని అందంగా తయారవుతారు: మంత్రి సీదిరి అప్పలరాజు