తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల రేపే

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఆగస్టు 24వ తేదీన ఉదయం 11.00 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసేందుకు టీడీడీ ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
ఇందులో సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, సెప్టెంబరు 18 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనము టికెట్లను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన రోజుల్లో దర్సనం చేసుకునేందుక ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.