Ushashri Charan: వారి గురించి మాట్లాడే అర్హతను మీరు కోల్పోయారు: మంత్రి ఉషశ్రీ చరణ్

ఏ ముఖం పెట్టుకుని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు.

Ushashri Charan: వారి గురించి మాట్లాడే అర్హతను మీరు కోల్పోయారు: మంత్రి ఉషశ్రీ చరణ్

Ushashri Charan

Updated On : September 7, 2023 / 8:09 PM IST

Ushashri Charan – YCP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ మాట్లాడారు.

వైసీపీ చేసిన అభివృద్ధిని తాము చూపిస్తామని, చంద్రబాబు చేసిన అబివృద్ధి ఏదైనా ఉంటే చూపిస్తారా? అని ఉషశ్రీ చరణ్ సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల గురించి మాట్లాడే అర్హతను చంద్రబాబు కోల్పోయారని చెప్పారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు సైకో పాలన అందించారని, అందుకే ఆయనను ప్రజలు దూరం పెట్టారని చెప్పారు.

ఏ ముఖం పెట్టుకుని మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు. బీసీలకు పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ఐటీ నుంచి రూ.118 కోట్ల విషయంలో నోటీసులు అందుకున్న చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పాలని అన్నారు.

ఎవరో స్క్రిప్టు రాసిస్తే దాన్ని చదవడం ముఖ్యం కాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు ధనయజ్ఞం చేస్తే తమ జగన్మోహన్ రెడ్డి జలయజ్ఞం చేస్తున్నారని అన్నారు. బీటీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు శిలాఫలకం మాత్రమే వేశారని అన్నారు. ఆయన అక్కడ తీసుకున్న సెల్ఫీ ఫొటో భూమికి కూడా డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు.

Telangana Congress: కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది?