Vangaveeti Radhakrishna : ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు.. ప్రజల కోసం ఏం చేశాన్నమదే లెక్క- వంగవీటి రాధా

Vangaveeti Radhakrishna : వంగావీటి రంగాని ప్రజలు ఇంతగా అభిమానిండానికి కారణం.. ప్రజలకు ఆయన చేసిన సేవ అని వంగవీటి రాధా అన్నారు.

Vangaveeti Radhakrishna : ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు.. ప్రజల కోసం ఏం చేశాన్నమదే లెక్క- వంగవీటి రాధా

Vangaveeti Radhakrishna(Photo : Google)

Updated On : June 25, 2023 / 11:58 PM IST

Vangaveeti Radhakrishna – NTR District : ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచామన్నది కాదు ప్రజల కోసం ఏం చేశాం అన్నదే లెక్క అని వంగవీటి రాధా అన్నారు. రెడ్డిగూడెంలో వంగవీటి మోహన రంగ విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుడు వంగవీటి రాధా, మైలవరం జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహన్ నాయుడు (గాంధీ) ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు.

రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు టూ మచ్ గా మాట్లాడుతున్నారని వంగవీటి రంగా మండిపడ్డారు. మాట్లాడితే.. నేను అన్నిసార్లు ఎమ్మెల్యేని అని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచామన్నది కాదు.. ఆ సమయంలో ప్రజల కోసం ఏం చేశారు అనేది గుర్తు ఉండాలని వంగవీటి రాధా హితవు పలికారు. వంగావీటి రంగాని ప్రజలు ఇంతగా అభిమానిండానికి కారణం.. ప్రజలకు ఆయన చేసిన సేవ అని వంగవీటి రాధా అన్నారు.

Also Read..Psychiatric surgery: భారత్‌లో మొట్టమొదటిసారి సైకియాట్రిక్ సర్జరీ.. డిప్రెషన్ దూరం

వంగవీటి మోహన రంగా చేసిన త్యాగాన్ని కుటుంబ చరిత్రగా యువతకు, ప్రజలకు వివరించారు జనసేన నియోజవర్గం ఇంచార్జి అక్కల రామ్మోహన్. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగా యూత్, భారీ ర్యాలీగా అభిమానులు జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.