భయం నా బ్లడ్‌లోనే లేదు.. అందుకే వదిలేశా.. వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్
జగన్‌పై ఎన్నడూలేని విధంగా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మొట్టమొదటిసారి కౌంటర్ ఇచ్చారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. “వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, పార్టీని వీడుతున్నవారి గురించి తాజాగా జగన్ మాట్లాడుతూ.. పాలిటిక్స్‌లో వ్యక్తిత్వం, విశ్వసనీయత ప్రధానమని అన్నారు. రాజకీయ నేతలు ప్రలోభాల వల్లో లేదంటే భయపడో వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం ఏంటని నిలదీశారు.
విజయ సాయిరెడ్డితో పాటు పార్టీని వీడిన వారు అందరికీ ఇదే వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ ఇప్పుడు ఉందంటే అది నాయకుల వల్ల అయితే కాదని చెప్పారు. దీంతో ఇవాళ దీనిపైనే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వైసీపీని విజయ సాయిరెడ్డితో పాటు పలువురు నేతలు ఇప్పటికే వీడారు. వైసీపీని వీడుతున్న వేళ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను కూడా వీడుతున్నానని, వ్యవసాయం చేసుకుంటానని అన్నారు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025