అందుకే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు.

అందుకే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy

ఎన్నికల వేళ వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2009లో నెల్లూరు లోక్‌సభ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారని తెలిపారు. తన సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

టీడీపీకి నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి లేరని, అందుకే తమ పార్టీ నుంచి తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చట్ట సభల్లో జనసేన పార్టీకి ఎక్కడా ప్రాతినిధ్యం లేదని చెప్పారు. అందుకే టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని తెలిపారు. కొందరు నేతలు నైతిక విలువలు పక్కనపెట్టి మాట్లాడుతున్నారని చెప్పారు.

నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇటీవల విశాఖ పోర్టుకు మాదక ద్రవ్యాలు కలిగిన కంటైనర్ వస్తే దాన్ని వైసీపీకి అపాదించారని చెప్పారు. సంధ్యా ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలిపారు. టీడీపీ నేతలతో వారికి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతిపై విచారణ జరుగుతోందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. అనైతిక యుద్ధాన్ని టీడీపీనే ప్రారంభించిందని అన్నారు.

ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్ రావు