Ys Jagan : అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు..!

సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Ys Jagan : అసెంబ్లీ సమావేశాలకు జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు..!

Updated On : February 22, 2025 / 6:52 PM IST

Ys Jagan : అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించనున్నారు. శాసనసభకు రావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.

సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఇక ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ అయ్యి బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు.

గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. మండలి సమావేశాలకు మాత్రమే వైసీపీ హాజరైంది. తాజాగా జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో గత సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది.

Also Read : గ్రూప్ 2 వాయిదా వేయండి.. APPSCకి ప్రభుత్వం లేఖ

ప్రతిపక్ష హోదా కల్పించిన తర్వాతే అసెంబ్లీకి వస్తామంది. ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా ఉంటే ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఉంటుందని.. కాబట్టి కచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన స్పీకర్ కూడా లేఖ రాశారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అంటోంది. ఈ అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం నుంచి వైసీపీ పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. సోమవారం ఉదయం 9 గంటలకల్లా అసెంబ్లీలో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం సమాచారం ఇచ్చింది.

9.30కు తమ చాంబర్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కూడా ఉండబోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా వైసీపీ పాల్గొంటుందా లేదా? వారి స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? అనేది ఎల్లుండి సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ స్పీచ్ లో వైసీపీ తమ డిమాండ్ ను కచ్చితంగా వినిపించే అవకాశం ఉంది.

Also Read : వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ..! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక్కరోజు మాత్రమే హాజరై నిరసన తెలియజేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు.

తర్వాత జరిగిన సమావేశాలకు కూడా వైసీపీ దూరంగా ఉంది. తాజాగా జరిగే బడ్జెట్ సమావేశాలకు కచ్చితంగా హాజరై.. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.