చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kakani Govardhan Reddy: ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకి వెళ్లకపోగా..

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kakani Govardhan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ప్రతి కార్యక్రమం ఆరంభ శూరత్వంగానే ఉందని చెప్పారు.

అంతేగానీ ఫలితాలు ఏమీ కనపడడం లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి ఎక్కడలేని హైప్ చేశారని, ప్రయోజనం ఏమీ లేదని తెలిపారు. ఏయే సమస్యలపై, అంశాలపై చర్చించారు అన్నది ఎక్కడా చెప్పలేదని అన్నారు. ముఖ్యమంత్రుల భేటీలో దిశ, దశ లేదని తెలిపారు.

మాదక ద్రవ్యాల ఉదంతాలు తెలంగాణాలో వెలుగుచూశాయా, ఏపీలో ఉన్నాయా? అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. లేనివి మాట్లాడి మన పరువు మనమే తీసుకున్నట్లు అవుతోందని తెలిపారు. ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకి వెళ్లకపోగా వెనుకబాటుగానే చూడాలని చెప్పారు. పోలవరం వైఎస్ మొదలు పెడితే అప్పట్లో చంద్రబాబు అలసత్వం చేశారని అన్నారు. విలీన గ్రామాలను వెనక్కి ఇస్తే పోలవరం ప్రాజెక్టు అటకెక్కడం ఖాయమని తెలిపారు.

టన్నుకు రూ.88 వసూలు.. ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం, విధివిధానాలు ఇవే