ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు 

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 12:29 PM IST
ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు 

Updated On : March 6, 2020 / 12:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో మహిళలకు పెద్దపీట వేశారు. ఎనిమిది జిల్లాల్లో మహిళలే జెడ్పీ చైర్ పర్సన్‌లు కాబోతున్నారు. మార్చి 21, 24న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఈనెల 27న మున్సిపల్ ఎన్నికలు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

జిల్లాల వారిగా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు
శ్రీకాకుళం- బీసీ (మహిళ), విజయనగరం- జనరల్, విశాఖ -ఎస్టీ (మహిళ), తూర్పుగోదావరి -ఎస్సీ (మహిళ), పశ్చిమగోదావరి -బీసీ జనరల్, కృష్ణా -జనరల్ (మహిళ), గుంటూరు -ఎస్సీ (మహిళ), ప్రకాశం -జనరల్ (మహిళ), నెల్లూరు -జనరల్ (మహిళ), చిత్తూరు -జనరల్, కడప -జనరల్, అనంతపురం -బీసీ (మహిళ), కర్నూలు-జనరల్. 
 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల 
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రెండు విడుతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 21న తొలి విడత ఎన్నికలు, మార్చి 24న రెండో విడత ఎన్నికల జరుగున్నాయి. మార్చి 27న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 29న ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. ఇది తెలిసిన సమాచారం మేరకే. రేపు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనున్నారు.