Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వీళ్ల ద్వారా ధనం కలిసి వస్తుంది..!

ఈ రోజు (2024, అక్టోబర్ 17 గురువారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వీళ్ల ద్వారా ధనం కలిసి వస్తుంది..!

Updated On : October 16, 2024 / 5:20 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ పౌర్ణమి సా 5:55, రేవతి 4:20 సా|| గురువారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి:  ప్రయాణం వల్ల లాభాలు కలుగుతాయి, శుభవార్త శ్రవణం, విందు భోజనము, కార్యసిద్ధి ధన లాభము, సధ్గోష్టి: లలితా సహస్ర నామ పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ప్రముఖులతో పరిచయాలు, వ్యాపార లాభములు, శ్రమను వృధా చేసుకోకూడదు, అవకాశాలు వినియోగించుకోవాలి, ధన ధాన్యలాభములు, కుటుంబంలో సంతోషము, విధ్యార్దులకు అనుకూలము, ఉద్యోగ వ్యాపారములో అధిక ఆదాయం, విదేశీయానం, దూరపు ప్రయాణములు: దత్తాత్రేయ కవచం పారాయణము చేసిన ఉత్తమ ఫలితాలు వస్తాయి.

మిథున రాశి: మీరు ప్రేమించిన వారితో వివాదములు రాకుండా చూసుకోండి, అధిక లాభములు, ఏ రంగములో అయినా అభివృద్ధి, కుటుంబములో వారికి ఆరోగ్యము, ఆదరాభిమానములు పొందడం, విద్యావంతులకు గౌరవ సన్మానములు పొందుతారు, వివాహ సంబంధములు కుదురుతాయి, పిత్రార్జితము ద్వారా ధనము కలసి వస్తుంది: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసిన శుభఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: పనిలో ఆలస్యము, అధిక ఖర్చులు, కార్యరంగంలో ప్రతికూలత, శత్రువృద్ది, బంధు మిత్రులతో విరోధము, ప్రయాణంలో ప్రమాదములు జరగకుండా జుగ్రత్తపడాలి, అనారోగ్యము, వాయిదాలు పడుతాయి, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, భయము పెరుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయవలెను శుభం కలుగుతుంది.

సింహ రాశి: ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, వివాహ విషయంలో ఆటంకములు, సరియైన నిర్ణయము లేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సర్దుబాటుతత్వం అలవర్చుకోవాలి, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, ప్రయాణంలో ఇబ్బందులు – ఇష్టదైవ ఆరాధన చేసినచో శుభ ఫలితములు వస్తాయి. 

కన్యా రాశి: ప్రతి పనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి, శారీరక సుఖం, కార్యసిద్ది, శుభ కార్యక్రమములో పాల్గోనుట, వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులతో లాభం, ధనాదాయం, గౌరవ మర్యాదలు, కుటుంబంలో శుభములు: ఓం నమో నారాయణయ నమఃఅష్టాక్షరి మంత్రము చదివినచో శుభం కలుగును. 

తులా రాశి: పుణ్యాలు చేయడం, గౌరవ సన్మానాలు, గృహములో శుభ కార్యక్రమములు చేయడం, వధూవరులకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధన సమృద్ధి, విధ్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం: అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: ధన విషయాల్లో జాగ్రత్త అవసరం, వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరియైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురి కావడం, గణపతి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితమలు కలుగుతాయి.

ధనస్సు రాశి: బంధుమిత్ర వైరములు, ప్రతి పనిలో ప్రతికూలత, ధనలాభం, వృత్తి ఉద్యోగములలో విజయం సాధించడం, మరచి పోవడం, అలసత్వం, ప్రయాణముల వలన లాభం కలగడం, సుఖ నిద్ర, సమాజంలో గౌరవము: శ్రీ మహాలక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: విలువైన ఆభరణాలు కొనడం, గృహ ఉపకరణ వస్తువులు కొనడం, కార్యములందు విజయం, శారీరక సౌఖ్యం, అన్నింటా అభివృద్ధి, ఆరోగ్యం కుదుట పడటం, స్త్రీలకు నూతన ఆలోచనలు పెరగడం, నూతన వస్త్ర ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము: లలితా సహస్ర నామ పారాయణము చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి: వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ అధికం, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము, బంధుమిత్రుల కలయిక, గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకరం: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.

మీనా రాశి: ఆకస్మిక ప్రయాణములు, స్థానచలనము, గృహములో మార్పులు, శుభ కార్యసిద్ధి, కోపంతో వివాదములు పెరుగుట, వస్తు వాహనములు కొనడం, ఆకస్మిక ధన లాభం, స్త్రీ మూలక వివాదములు, ఋణ బాధ నివృత్తి: సుందర కాండ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956