TTD Decisions: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే.. వరలక్ష్మీ వ్రతం రోజున..

టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలువుదోపిడీ నుండి..

TTD Decisions: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే.. వరలక్ష్మీ వ్రతం రోజున..

Updated On : June 17, 2025 / 7:51 PM IST

TTD Decisions: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇటీవల బెంగళూరులో టీటీడీ నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో పాల్గొన్నానని.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కలిశానని తెలిపారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం బెంగళూరు వయాలికావల్ లో ఉన్న టీటీడీ శ్రీవారి ఆలయం చిన్నదిగా ఉందని, ప్రైమ్ ప్లేస్ లో స్థలం కేటాయిస్తామని, పెద్ద ఆలయం నిర్మించాలని డీకే శివకుమార్ కోరారని బీఆర్ నాయుడు చెప్పారు. స్థలం కేటాయించగానే శ్రీవారి ఆలయం నిర్మించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీకి 100 విద్యుత్ బస్సులు అందజేస్తానని కేంద్రమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని బీఆర్ నాయుడు తెలిపారు.

”టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలువుదోపిడీ నుండి భక్తులకు విముక్తి లభిస్తుంది. త్వరలో తిరుపతిలో సీఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు జరగనుంది. ల్యాబ్ నిర్మాణానికి స్థలాన్ని లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించాం. సీఎస్ఆర్ ల్యాబ్ ద్వారా నెయ్యి, నీరు, పప్పు ధాన్యాలు నాణ్యత పరిశీలన చేస్తుందన్నారు.

Also Read: బీజేపీలోకి మెగాస్టార్..? కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్..

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గా పేరు పెట్టాలని కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపించాలని నిర్ణయించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం.

సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో దాదాపు 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వనున్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం కార్యక్రమం. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.