Gold Rate: బాబోయ్.. ఏందీ బంగారం రేట్లు.. ఒక్కరోజులో ఇంత మార్పా.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.

Gold Rate: బాబోయ్.. ఏందీ బంగారం రేట్లు.. ఒక్కరోజులో ఇంత మార్పా.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

Gold

Updated On : April 10, 2025 / 11:14 AM IST

Gold And Silver Price: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ షాకింగ్ న్యూస్. ఎందుకంటే.. ఇవాళ ఒక్కరోజే గోల్డ్ రేటు భారీ పెరిగింది. వందల్లో కాదు.. ఏకంగా వేలల్లో పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

Gold Rate

బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.2,940 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 2,700 పెరిగింది. మరోవైపు వెండి ధర సైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బుధవారం ఉదయం ఔన్స్ గోల్డ్ ధర 3,127 డాలర్లకు చేరింది. నిన్నటితో పోల్చుకుంటే ఏకంగా 100 డాలర్లు పెరిగింది. మరోవైపు ఔన్స్ సిల్వర్ ధర స్వల్పంగా పెరిగి 31.17 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.85,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ.93,380కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.93,530కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 85,600 కాగా.. 24క్యారెట్ల ధర రూ.93,380 గా నమోదైంది.

Gold Rate

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,04,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.95,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,04,000 వద్ద కొనసాగుతుంది.

Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో అనేక దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.