Gold Rate: పసిడి ప్రియులకు ఊహించని షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. నోరెళ్లబెట్టాల్సిందే..

మంగళవారం తులం బంగారంపై రూ. వెయ్యికిపైగా పెరగ్గా.. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.

Gold Rate: పసిడి ప్రియులకు ఊహించని షాక్.. వరుసగా రెండోరోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. నోరెళ్లబెట్టాల్సిందే..

Gold

Updated On : July 23, 2025 / 11:00 AM IST

Gold Rates Today : బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు పసిడి పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు పసిడి మీద భారీ కొనుగోళ్లు, రీటైల్ వ్యాపారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వంటి అంశాలు బంగారాన్ని ఈక్విటీ షేర్ల కంటే ఎక్కువ డిమాండ్ గా మార్చాయి.

మంగళవారం తులం బంగారంపై రూ. వెయ్యికిపైగా పెరగ్గా.. ఇవాళ కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,040 పెరిగింది. 22 క్యారట్ల బంగారంపై రూ.950 పెరిగింది. అయితే, గడిచిన వారం రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సుమారు రూ. 3వేలు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై తొమ్మిది డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు బంగారం 3,421 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు.. వెండి ధరలు భగభగ మంటున్నాయి. మంగళవారం కిలో వెండిపై రూ.2వేలు పెరగ్గా.. ఇవాళ (బుధవారం) కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.

ఆరేళ్లలో గోల్డ్ రేటు ఎంత పెరిగిందంటే..
గత ఆరేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2019 మే నెలలో 10గ్రాముల బంగారం ధర రూ.30వేలు ఉండగా.. ప్రస్తుతం (జులై 2025) తులం గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేవలం ఆరేళ్ల కాలంలో బంగారం ధర దాదాపు రూ.70వేలు అంటే.. 200శాతానికి పైగా పెరిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ నెలాఖరు నాటికి గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,800కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,330కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,950కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,480కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,02,330కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,29,000కు చేరుకుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,19,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,29,00కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.