Gold Rate: మహిళలకు ఇదే మంచి ఛాన్స్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి రేట్లు ఇవే..
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై..

Gold
Gold Rate: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే మీకు శుభవార్త. గత పదిరోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేటు.. ఇవాళ కూడా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో గోల్డ్ రేటు రోజురోజుకు తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. జులై నెలలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 150 తగ్గగా.. 24క్యారట్ల గోల్డ్ పై రూ.160 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ గోల్డ్ ఆరు డాలర్లు తగ్గి.. ప్రస్తుతం 3,280 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి రేటు కూడా స్వల్పంగా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,150కాగా.. 24 క్యారట్ల ధర రూ. 97,260 వద్దకు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 97,410కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.89,150కాగా.. 24క్యారెట్ల ధర రూ. 97,260 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,700కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,07,700 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,17,700 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.