Gold Rate : బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్..! తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold
Today Gold and Silver Rate : నవంబర్ – డిసెంబర్ నెలల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. నవంబర్ 4నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 32 లక్షల వివాహాలు జరగనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్న వేళ బంగారం ధరసైతం అదే స్థాయిలో పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తుంది. తాజాగా.. బంగారం ధర భారీగా పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 250 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 270 పెరిగింది. వెండి ధరసైతం భారీ పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 1300 పెరిగింది.

Gold Price Today
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 57,350 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,560 కు చేరింది.

Gold Rate
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,710.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,560కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,050 కు చేరింది.

Gold Price
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 1300 పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.78,500 కు చేరింది. బెంగళూరులో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ కిలో వెండి రూ.76,250 వద్ద కొనసాగుతుంది.