Gold Price Today: నెలరోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే..
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర పెరుగుతోంది. గతవారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ. 2వేల డాలర్లు దాటగా, అంతకుముందు ఔన్సుకు 1,900 డాలర్లుగా ఉంది.

Gold price
Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. వరుస పండుగల నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలుకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. గడిచిన నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ మొదటి వారంలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 55,480 ఉండగా.. ప్రస్తుతం రూ. 57,410 వద్దకు చేరుకుంది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర అక్టోబర్ మొదటి వారంలో రూ. 55,978గా ఉంది. ప్రస్తుతం రూ. 62,620కి చేరింది.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర పెరుగుతోంది. గతవారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ. 2వేల డాలర్లు దాటగా, అంతకుముందు ఔన్సుకు 1,900 డాలర్లుగా ఉంది. ఒక ఔన్సులో దాదాపు 28 గ్రాములు ఉంటాయి. మరోవైపు ఇజ్రాయెల్ – హమాస్ వివాదంకూడా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరగడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా, సోమవారం నమోదైన వివరాల ప్రకారం 10గ్రాముల బంగారంపై రూ. 100 పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 57,410 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 62,630కు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,560 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,780కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,410కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,630 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.57,710 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,960 వద్దకు చేరింది
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి రూ.73,750 వద్ద కొనసాగుతుంది.