Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold
Today Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. కొద్దిరోజులు మంచి ముహూర్తాలు ఉండటంతో పలు కుటుంబాల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. శుభకార్యాలున్నా, ఏమైనా పండుగలు ఉన్నా, పెళ్లిళ్లు ఉన్నా చాలామంది మహిళలు బంగారం కొనుగోళ్లు జరుపుతారు. తాజాగా మంచి మహూర్తాలు ఉండటంతో తమ ఇండ్లలో శుభకార్యాలు ఉన్నవారు బంగారం దుకాణాలవైపు చూస్తున్నారు. వారికి ఊరట కలిగిస్తూ బంగారం ధరలుసైతం కాస్త తగ్గుముఖం పట్టాయి.

Gold Price Today
ఇటీవలి కాలంలో బులియన్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (22 క్యారెట్ల) ధర రూ. 54,550 ఉంది. మంగళవారం కంటే రూ. 100 తగ్గింది. అదేవిధంగా పది గ్రాముల బంగారం (24 క్యారెట్ల) ధర రూ. 59,510 ఉంది. మంగళవారం కంటే రూ.110 తగ్గింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలును ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,550, అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 59,510గా ఉంది.

Gold
ప్రధాన నగరాల్లో 10 గ్రాములు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ. 54,700, అదేవిధంగా 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 55,000, అదేవిధంగా 24 క్యారెట్ల ధర రూ.60వేలుగా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళ, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ. 54,550, అదేవిధంగా 24 క్యారెట్ల ధర రూ. 59,510 ఉంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 76,000లుగా ఉంది. అయితే, బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటల వరకు నమోదై ధరలు. స్వల్పంగా మార్పులు చోటుచేసుకొనే అవకాశాలు ఉన్నాయి.