Gold Price Today: మీరు బంగారం కొంటున్నారా? అయితే గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో ..

Gold
Gold and Silver Prices: మీరు బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో గోల్డ్ ధరలు భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 తగ్గగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పై రూ. 160 మేర తగ్గుదల చోటు చేసుకుంది. వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటు చేసుకుంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. మంగళవారం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 53,200 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,040 గా నమోదైంది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,350 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,190కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.53,356 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,430 వద్ద కొనసాగుతుంది. ఇక బెంగళూరు, కోల్‌కత్తా, ముంబయి వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 53,200కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 58,040 వద్ద కొనసాగుతోంది.

Gold
తగ్గిన వెండి ధర..
దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,500 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ. 73,000కు చేరింది. బెంగళూరులో కిలో వెండి 71,250 వద్ద కొనసాగుతుంది.