మీది Samsung స్మార్ట్ టీవీనా : ఇకపై Netflix పనిచేయదు

  • Published By: sreehari ,Published On : November 17, 2019 / 04:01 AM IST
మీది Samsung స్మార్ట్ టీవీనా : ఇకపై Netflix పనిచేయదు

Updated On : November 17, 2019 / 4:01 AM IST

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ స్మార్ట్ టీవీ యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ స్మార్ట్ టీవీల్లో OTT ప్లాట్ ఫాంల్లో అగ్రగ్రామి అయిన Netflix సర్వీసు నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 1, 2019 నుంచి పాత వెర్షన్ శాంసంగ్ స్మార్ట్ టీవీల్లోని Netflix యాప్ పనిచేయదు. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంకేతిక పరిమితుల కారణంగా 2010, 2011 మోడల్స్ శాంసంగ్ స్మార్ట్ టీవీల్లోని నెట్‌ఫ్లిక్స్ సర్వీసు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు.. సెవన్ ఓల్డర్ స్ట్రీమింగ్ స్టిక్స్ కూడా నెట్ ఫ్లిక్స్ పై డిసెంబర్ నుంచి పనిచేయవని కంపెనీ తెలిపింది. 

సాధారణంగా Netflix ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసును స్మార్ట్ టీవీలు, సెట్ టాప్ బాక్సులు, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లు, వీడియో కన్సోల్స్ వీక్షించవచ్చు. ఇదివరకే శాంసంగ్ కంపెనీ డిసెంబర్ 1 నుంచి తమ పాత మోడల్ స్మార్ట్ టీవీలపై నెట్ ఫ్లిక్స్ యాప్ సర్వీసులు నిలిచిపోనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాత మోడల్ స్మార్ట్ టీవీలు వినియోగించే కస్టమర్లు నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ చేసే ఇతర డివైజ్ లతో కనెక్ట్ చేసుకుని యాక్సస్ చేసుకోనే వీలుంది. 

స్ట్రీమింగ్ స్టిక్స్ ద్వారా పాత శాంసంగ్ స్మార్ట్ టీవీలపై నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సర్వీసులను యాక్సస్ చేసుకోవచ్చునని టెక్ రివ్య్సూ ఎడిటర్ జిమ్ మార్టిన్ తెలిపారు. పాత స్ట్రీమింగ్ స్టిక్ మోడల్స్ లలో Roku 2050x, Roku 2050X, Roku 2100X, Roku 2000C, Roku HD Player, Roku SD Player, Roku XR Player, Roku XD Player నెట్ ఫ్లిక్స్ యాప్ సపోర్ట్ చేయదు.