బాదుడే బాదుడు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.

  • Published By: sreehari ,Published On : January 13, 2019 / 12:40 PM IST
బాదుడే బాదుడు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated On : January 13, 2019 / 12:40 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జనవరి 13వ తేదీన పెట్రోల్ ధర 48-60 పెరగగా, డీజిల్ ధర 60-75 పైసలు చొప్పున పెరిగింది. ఈ రోజు పెరిగిన పెట్రోల్ ధరతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 69.75 పైసలుగా నమోదైంది. శనివారం పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరపై 49 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 63.69 పైసలుగా నమోదైంది. అలాగే ఇతర నగరాల్లో కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. 

ముంబైలో లీటరు పెట్రోల్ ధరపై (48 పైసలు పెంపు)తో రూ. 75.39 పైసలు రికార్డు కాగా, డీజిల్ లీటర్ ధర రూ. 66.66 (62 పైసలు పెంపు) రికార్డు అయింది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ. 72.04 (51 పైసలు), డీజిల్ లీటరు ధర రూ. 65.78 (61పైసలు)గా నమోదు అయింది. చెన్నైలో, కోల్ కతాలో లీటరు పెట్రోల్ పై 48-53 పైసలు పెంచగా, డీజిల్ లీటర్ పై 59-64 పైసలు అధికంగా పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.71.97 ఉండగా, కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.40 పైసలుగా నమోదైంది. ఇక చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ.65.46 ఉండగా, కోల్ కతాలో డీజిల్ ధర రూ. 67.26 గా నమోదైంది.