గుడ్ న్యూస్ : పెట్రోల్, బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి

దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది.

  • Published By: sreehari ,Published On : October 15, 2019 / 08:11 AM IST
గుడ్ న్యూస్ : పెట్రోల్, బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి

Updated On : October 15, 2019 / 8:11 AM IST

దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది.

దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ తగ్గుతుంటే.. మరోవైపు బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ప్రతి రోజు 5 పైసలు వరకు చమురు ధరలు పడిపోయాయి.

ఈ నెలలో లీటర్ పెట్రోల్ ధర రూ.1.34 తగ్గితే.. డీజిల్ ధర లీటర్ రూ.1.08 వరకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.27 నమోదు కాగా.. డీజిల్ ధర లీటర్ రూ.66.41గా నమోదైంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.88 ఉంటే.. డీజిల్ ధర రూ.69.61గా నమోదైంది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.75.72 ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.68.62గా రికార్డు అయింది. 

గత కొన్నిరోజుల నుంచి ఇండియాలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో బాగా తగ్గిన బంగారం ధరలు గ్లోబల్ రేట్లలో కదిలికలతో అక్టోబర్ నెలలో వరుసగా రెండో రోజు కాస్త పుంజుకున్నాయి. సెప్టెంబర్ నెలలో అత్యధిక రికార్డు స్థాయిని చేరిన బంగారం ధరలతో పోలిస్తే అక్టోబర్ నెలలో బంగారం ధరలు రూ.1,750 మేర తగ్గాయి. వెండి మాత్రం పెరుగుతూ వస్తూనే ఉంది. 

ఎంసీఎక్స్ డిసెంబర్ గ్లోల్డ్ ఫ్యూచర్ ధరలు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర 0.05శాతంగా పెరిగి రూ.38వేల 244కు చేరింది. సోమవారం 1శాతం పెరిగిన తర్వాత మంగళవారం ఒక్కసారిగా బంగారం పైకి ఎగిసింది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా ఎంసీఎక్స్ పై అత్యధికంగా 0.20 శాతం పెరిగి కిలో వెండి ధర రూ.45వేల 886గా రికార్డు అయింది.

సెప్టెంబర్ నెలలో 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా రూ.40వేల రికార్డును చేరింది. అప్పటి నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. చైనా-అమెరికా ట్రేడ్ డీల్ తొలి దశ కొనసాగుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో నెమ్మదించడంతో సోమవారం బంగారం ధరలు పెరిగినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.