రూ.1కే 1GB ఇస్తున్నాం : Jioకు Wifi Dabba డేటా సవాల్!

  • Published By: sreehari ,Published On : January 24, 2020 / 01:00 PM IST
రూ.1కే 1GB ఇస్తున్నాం : Jioకు Wifi Dabba డేటా సవాల్!

Updated On : January 24, 2020 / 1:00 PM IST

ప్రపంచంలో అతి చౌకైన ధరకే మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. జియోకు పోటీగా ఇతర టెలికం దిగ్గజాలు కూడా పోటీపడి డేటా ఆఫర్లను గుప్పించాయి. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరకే ఎక్కువ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.

అయితే టెలికం రంగాన్ని షేక్ చేసిన రిలయన్స్ జియోకు ఓ బెంగళూరు స్టార్టప్ కంపెనీ డేటా సవాల్ విసురుతోంది. జియోకు దిమ్మతిరిగేలా అతి తక్కువ ధరకే డేటాను ఆఫర్ చేస్తోంది. ఒక రూపాయికే 1GB డేటా ఇస్తోంది. ముఖేశ్ అంబానీ జియోకు గట్టి పోటీనిస్తోంది. అదే.. Wifi Dabba. 2016లోనే ఈ స్టార్టప్ కంపెనీని స్థాపించారు. 

ఎలాంటి ఫీజు అక్కర్లేదు : కనెక్షన్ ఫ్రీ :
ప్రతిఒక్కరికి Gigabit WiFi నెట్ వర్క్ యాక్సస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. హైస్పీడ్ ఇంటర్నెట్ ను కేవలం రూ. 1కు 1GB వరకు అందిస్తోంది. దీనికి అదనంగా ఎలాంటి సబ్ స్ర్కిప్షన్ ఫీజు, siging up లేదా Installation ఫీజులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మొబైల్ డేటా మార్కెట్లో రిలయన్స్ జియో అందించే చీపెస్ట్ ప్లాన్ల కంటే 360 శాతం చాలా తక్కువ.

బెంగళూరులోని మొబైల్ డేటా యూజర్లకు నగరవ్యాప్తంగా Wi-Fi వంటి హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ కంపెనీ Wifi Dabba సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ వైఫై సర్వీసు బెంగళూరులో ఎంతో పాపులర్ అయింది. జియోకు గట్టి పోటీనిస్తూ వేలాది మంది యూజర్లను ఆకట్టుకుంటోంది. 

సూపర్ నోడ్స్.. 100 శాతం కవరేజ్ టార్గెట్ :
100 శాతం కవరేజ్ అందించడమే లక్ష్యంగా supernodes కాన్సెప్ట్ తో Wifi Dabba వైర్ లెస్ నెట్ వర్క్ ను కంపెనీ విస్తరిస్తోంది. నగరవ్యాప్తంగా పెద్ద భవనాలతో పాటు అన్ని టవర్లలోనూ Wifi Dabba నెట్ వర్క్ ను ప్రతిఒక్కరూ యాక్సస్ చేసుకునేలా సూపర్ నోడ్స్ కనెక్టవిటీని అందిస్తోంది.

వాస్తవానికి ఇతర కేబుల్ నెట్ వర్క్ మాదిరిగా Fibre optic కేబుల్స్ రోడ్ల కింద నుంచి కనెక్టవిటీ అవసరం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ర్టమ్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. నీళ్ల సంచి ధర కంటే తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను ఈ కంపనీ ఆఫర్ చేస్తోంది. Wifi Dabba నెట్ వర్క్ ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి గల యూజర్లు కంపెనీ వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. 

Wifi Dabba ఎలా పనిచేస్తుందంటే? :
* Wi-fi dabba సర్వీసును తమ Wi-Fi routersతో లోకల్ షాపుల్లో ఇన్ స్టాల్ చేస్తోంది.
* మీ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా Wifi Dabba నెట్ వర్క్ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. 
* ఒకవేళ మీకు ప్రస్తుత డేటా ప్లాన్ లేదంటే.. రూ.1 తో 1GB డేటాను పొందవచ్చు.
* స్థానికంగా Wifi Dabba టోకెన్లను కూడా కొనుగోలు చేసుకోవచ్చు.
* ఆన్ లైన్ లో కూడా ఈ టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. 
* అవసరమైతే అధిక డేటా కావాలంటే కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.