అమెరికాలో కాల్పుల కలకలం : 13 మందికి గాయాలు

  • Published By: chvmurthy ,Published On : December 22, 2019 / 03:43 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం : 13 మందికి గాయాలు

Updated On : December 22, 2019 / 3:43 PM IST

అమెరికాలోని చికాగోలో  డిసెంబర్ 22,ఆదివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఒక విందు వేడుకలో భాగంగా కొందరు యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ….చికాగోలో కొందరు యువకులు ఒక ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విందు జరుగుతున్నసమయంలో వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో వారిలో ఒకరు జరిపిన కాల్పుల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటలకు చోటుచేసుకుందని, బాధితులంతా 16 నుంచి 48  ఏళ్ల మధ్య వయస్సు వారేనని పేర్కొన్నారు. కాగా, తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఫ్రెడ్‌ వాలర్‌ వెల్లడించారు.