పోలీస్ స్టేషన్ లో నుంచి పరారైన అత్యాచార కేసు నిందితుడు
పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీస్ స్టేషన్ లో నుంచి అత్యాచార కేసు నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్ పూర్ జిల్లా రాంనగర్ కు చెందిన సూరజ్ విశ్వఖర్మ అనే యువకుడు బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సూరజ్ ను అరెస్టు చేసి, కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.
మంగళవారం(డిసెంబర్ 17, 2019) నిందితుడు సూరజ్ ను కోర్టులో ప్రవేశపట్టాల్సివుంది. ఈ క్రమంలో నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది నిద్రలో ఉన్న సమయంలో సూరజ్ విశ్వఖర్మ పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడని ఎస్పీ రాజేశ్ కుక్రేజా చెప్పారు.
విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.