భర్త, పిల్లలు ఉండగానే మరొకరితో ప్రేమ వివాహం

ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక్ (42) ల ప్రేమ కధ ఇది. కానీ ఇప్పుడీ కధ మలుపు తిరిగింది. జ్యోతీశ్వరి ఇటీవల మరొకరిని ప్రేమించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాలరావు తో 2016 నుంచి ప్రేమలో పడింది.
ఈవిషయం అశోక్ కు తెలియటంతో కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రేమ కోసం మొదటి భర్త నుంచి విడిపోవటానికి భర్తను, పిల్లలను కాదనుకుని విడాకుల కోసం కోర్టు కెక్కింది జ్యోతీశ్వరి. సిటీ సివిల్ కోర్టులో విడాకుల పిటీషన్ పెండింగ్ లో ఉంది. ఇద్దరూ వేర్వేరుగా బతుకుతున్నారు.
అశోక్ ఇటీవల వ్యాపారం పనుల నిమిత్తం ఖమ్మం వెళ్లాడు. అక్కడ జ్యోతీశ్వరి వేణుగోపాల్ ను పెళ్లిచేసుకుందని….వారిద్దరూ భార్యా,భర్తలమని చెప్పి బ్యాంకు లోన్ కూడా తీసుకున్నారని తెలిసింది. విడాకుల కేసు పెండింగ్ లో ఉండగానే మరో వ్యక్తిని జ్యోతీశ్వరి మరోకరిని పెళ్లి చేసుకోవటంపై అశోక్ కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమై విచారణ జరుపమని కోర్టు బంజారా హిల్స్ పోలీసులను ఆదేశించింది. జ్యోతీశ్వరి మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.