పాతబస్తీలో రాళ్ల దాడి : 14 మందికి గాయాలు

హైదరాబాద్‌ పాతబస్తీలో బుధవారం రాత్రి ఇరువర్గాలు సరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మందికి గాయాలు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 03:51 AM IST
పాతబస్తీలో రాళ్ల దాడి : 14 మందికి గాయాలు

Updated On : January 24, 2019 / 3:51 AM IST

హైదరాబాద్‌ పాతబస్తీలో బుధవారం రాత్రి ఇరువర్గాలు సరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మందికి గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌ : పాతబస్తీలో బుధవారం రాత్రి ఇరువర్గాలు సరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మందికి గాయాలు అయ్యాయి. వివరాళ్లోకి వెళ్తే.. పురానాపూల్‌లో ఒక వివాహ వేడుక అనంతరం కొందరు యువకులు కిళ్లీలు కట్టించుకుని చిల్లర డబ్బుల గురించి పాన్‌షాప్‌ నిర్వాహకుడిపై చేయిచేసుకోవడంతో వివాదం నెలకొంది. అనంతరం పరస్పరం రాళ్లదాడులు మొదలై కోకాకితట్టీ నుంచి గుడ్‌విల్‌కేఫ్‌ వరకు కొనసాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని దాడులకు పాల్పడే వారిని చెదరగొట్టారు. జనం గుమికూడకుండా 144 సెక్షన్‌ విధించారు. వదంతులకు ఆస్కారం లేకుండా చేసేందుకు మొబైల్‌ నెట్‌వర్క్‌ను నిలిపివేశారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.