Criminal Encounter In Lucknow : బంగ్లాదేశ్‌కు చెందిన నేరస్తుడు ఎన్‌కౌంటర్
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం తెల్లవారు ఝూమున ఎన్‌కౌంటర్ జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన నేరస్తుడు హమ్జాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

Bangladeshi Criminal
Criminal Encounter In Lucknow : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం తెల్లవారు ఝూమున ఎన్‌కౌంటర్ జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన నేరస్తుడు హమ్జాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాకు చెందిన హమ్జా రూ. 10 వేలు లంచం ఇచ్చి భారత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. గడిచిన రెండేళ్లలో మూడు దోపిడీ కేసుల్లో హమ్జా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు.
ఢిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో హమ్జా ముఠా దోపిడీలకు పాల్పడింది. సోమవారం తెల్లవారుఝూమున గం.2.45 లకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గోమతి నగర్ లోని లోహియా పార్క్ వద్ద అనుమామాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించగా వారు పారిపోవటానికి ప్రయత్నించారు, వారిని పట్టుకోబోతుంటే వారి వద్ద ఉన్న మారణాయుధాలతో పోలీసులపై దాడి చేశారు.
Also Read : Police Constable Video Viral : పట్టపగలు పోలీసు గ్రౌండ్‌లో మద్యం సేవించిన పోలీసు వీడియో వైరల్
పోలీసులు వెంటనే వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా మరికొందరు తప్పించుకుపారిపోయారు. ఈ కాల్పులలో ముగ్గురు పోలీసులు కూడ గాయపడ్డారు. మరణించిన వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హమ్జా గా గుర్తించారు, ఇతనిపై రూ. 50 వేల రివార్డు ఉంది.