Cheating Case : ప్రేమ పేరుతో మోసాలు.. విజయవాడలో మాయలేడీ లీలలు
ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ వారి వద్దనుంచి డబ్బులు కాజేస్తున్న మాయలేడి ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది.

Case Filed On Woman For Cheating A Man On Pretext Of Marriage
Cheating Case : ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ వారి వద్దనుంచి డబ్బులు కాజేస్తున్న మాయలేడి ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని శ్రీదివ్య ప్రేమ పేరుతో యువకులకు మభ్యపెట్టి వారిని బురిడీ కొట్టించింది. గాంధీనగరానికి చెందిన ఓ ప్రముఖుడి నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేసింది. దీంతో ఆమె మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ప్రముఖుడు పోలీసులను ఆశ్రయించాడు.
శ్రీదివ్యతో పాటు ఆమె తమ్ముడు పోతురాజు.. ఆమెకు సహకరిస్తున్న రాజాక్ అనే వ్యక్తిపై బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. పెళ్లై పిల్లలున్నా…శ్రీ దివ్య వలపు వలతో నగరంలోని ఓ హోటల్ యజమాని, కార్పోరేటర్ తో సహా పలువురిని మోసం చేసినట్లు తెలుసుకున్నారు.
ప్రభుత్వ కాంట్రాక్టర్, కన్సల్టెంట్ అంటూ వ్యాపారులతో పరిచయం పెంచుకుని ఆమె మోసాలకు పాల్పడుతోంది. నగరంలో పేరోందిన ఒకన్యాయవాదిని అడ్డంపెట్టుకుని స్ధిరాస్తుల వ్యవహారాలు సెటిల్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకోవటం వంటి దందాలు చేసినట్లు గుర్తించారు. పదుల సంఖ్యలో శ్రీవిద్య బాధితులు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ లిస్టు తయారు చేసే పనిలో ఉన్నారు.