Cyber Crime: బీకేర్ ఫుల్.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో.. 2 లక్షలు దోచుకున్నారు.. మెదక్ లో ఘరానా మోసం..

ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు.

Cyber Crime: బీకేర్ ఫుల్.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో.. 2 లక్షలు దోచుకున్నారు.. మెదక్ లో ఘరానా మోసం..

Updated On : August 4, 2025 / 12:20 AM IST

Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. మన అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు దోచేస్తున్నారు. ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘారానా మోసానికి పాల్పడ్డారు. ఓ యువకుడి నుంచి ఏకంగా 2లక్షలు దోచుకున్నారు.

మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. విడతల వారీగా అతడి నుంచి 2 లక్షల రూపాయలు దోచుకున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్‌ నేరగాళ్లు పోస్ట్ పెట్టారు. అది చూసిన బాధితుడు అట్రాక్ట్ అయ్యాడు. ఇంట్లోనే ఉంటూ పని చేసుకుని డబ్బులు సంపాదించవచ్చని ఆశించాడు. వెంటనే సైబర్ క్రిమినల్స్ ను కాంటాక్ట్ అయ్యాడు.

యువకుడితో మాట్లాడిన కేటుగాళ్లు మాయమాటలు చెప్పారు. కొంత డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తే ఉద్యోగంతో పాటు లాభాలు ఇస్తామని నమ్మించారు. వారి మాటలకు అట్రాక్ట్ అయిన యువకుడు మోసగాళ్ల మాటలు నమ్మేశాడు. విడతల వారీగా వారికి 2 లక్షల రూపాయలు చెల్లించాడు. అయితే, అతడికి ఎలాంటి వర్క్ లభించలేదు. దాంతో తాను మోసపోయాయని గ్రహించిన బాధితుడు లబోదిబోమన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పై ఫిర్యాదు చేశాడు. తన డబ్బు తనకు ఇప్పించాలని అతడు పోలీసులను వేడుకున్నాడు.

సైబర్ నేరాల పట్ల పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని వారి మాయలో పడొద్దని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. సైబర్ క్రిమినల్స్ మాటలు గుడ్డిగా నమ్మి డబ్బు పోగొట్టుకుంటున్నారు. అధిక లాభాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయన్నారు. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.