సౌకర్యాలు లేవు : దిశా నిందితుల డెడ్ బాడీస్ తరలింపు

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 12:47 AM IST
సౌకర్యాలు లేవు : దిశా నిందితుల డెడ్ బాడీస్ తరలింపు

Updated On : December 8, 2019 / 12:47 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరలించారు. అంతకు ముందు దిశ హత్యాచార నిందితుల మృతదేహాలను పరిశీలించడానికి జాతీయ మానవహక్కుల కమిషన్‌ సభ్యులు ఢిల్లీ నుంచి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి వచ్చారు. అనంతరం చటాన్‌పల్లి వంతెన వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించి పలు వివరాలు సేకరించారు.   

మరోవైపు.. దిశ హత్య కేసులో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 9 వరకు మృతదేహాలను ఖననం చేయవద్దని, వాటిని భద్రపరచాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో… మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాలను భద్రపరచే వసతులు లేవని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే మృతదేహాలు డీ కంపోస్ అయ్యాయని తెలిపారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా తమ మృత దేహాలను ఇవ్వాలని కోరుతున్నారని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఇంకా హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాల్సి ఉంది.

* 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు. 
* మూతి, ముక్కు మూయడంతో దిశ కన్నుమూసింది. మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. 
* 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు నిందితులుగా గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 
* 14 రోజుల జ్యుడిషల్ కస్టడీ విధించింది కోర్టు. 
* వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు వీరిని విచారించారు. 
* సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌‌‌లో భాగంగా నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్దకు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తీసుకొచ్చారు. 
* పోలీసులపైకి దాడికి యత్నించి పారిపోవడానికి యత్నించారు. 
* పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు చనిపోయారు. 
Read More : ఈ దిశకు న్యాయమెప్పుడు : 17ఏళ్లుగా ప్రత్యూష తల్లి పోరాటం