ప్రేమ పెళ్లి చేసుకుని మోసం : ట్రైనీ ఐపీఎస్ పై వరకట్న వేధింపుల కేసు
పెద్ద చదువులు చదివినా బుద్ధి మాత్రం మారలేదు. ఆస్తులున్నా అత్యాశ మాత్రం పోలేదు. ట్రైనీ ఐపీఎస్ గా ఉంటూ ప్రేమ పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేశాడు.

పెద్ద చదువులు చదివినా బుద్ధి మాత్రం మారలేదు. ఆస్తులున్నా అత్యాశ మాత్రం పోలేదు. ట్రైనీ ఐపీఎస్ గా ఉంటూ ప్రేమ పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేశాడు.
పెద్ద చదువులు చదివినా బుద్ధి మాత్రం మారలేదు. ఆస్తులున్నా అత్యాశ మాత్రం పోలేదు. ట్రైనీ ఐపీఎస్ గా ఉంటూ ప్రేమ పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేశాడు. ఓ సంవత్సరం పాటు ఆమెతో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడో అప్పుడు అత్యాశకు పోయాడు. అధిక కట్నం రాబట్టేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలివేయడానికి పన్నాగం పన్నాడు. నువ్వెవరో నాకు తెలియదంటూ బుకాయిస్తున్నాడు ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారి. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వరకట్న కేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో చోటు చేసుకుంది.
కడపకు చెందిన మహేశ్ రెడ్డి, భావన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో వీరి మధ్య పరియమం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది కాలంగా ఇద్దరూ కలిసి ఉన్నారు. మహేశ్ రెడ్డి ఇటీవల ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యాడు. కడప జిల్లాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ట్రైనీగా వెళ్లిపోయాక ఇప్పటివరకు భావనను పట్టించుకోలేదు. వరకట్నం వేధింపులతోపాటు తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భావన రాచకొండ జవహర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.
తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ భావనతో మహేశ్ రెడ్డి చెప్పినట్లు ఫిర్యాదులో స్పష్టంగా వెల్లడించారు. తనను తరచుగా వేధించడంతోపాటు ఇప్పుడు మొత్తంగా ముఖం చాటేయడంతో ఫిర్యాదు చేశారు. భావన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్ రెడ్డిపై ఐపీఎస్ 490, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.