బంజారాహిల్స్‌లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్ కలకలం, కిడ్నాప్‌ చేసింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు

  • Published By: naveen ,Published On : October 7, 2020 / 11:19 AM IST
బంజారాహిల్స్‌లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్ కలకలం, కిడ్నాప్‌ చేసింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు

Updated On : October 7, 2020 / 1:07 PM IST

film distributor kindap: భూ వివాదంలో ఏకంగా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాధితుడి నుంచి కోట్ల రూపాయల విలువైన భూమి పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకొని వదిలేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కు మధ్య భూ వివాదం నడుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేష్‌ను కిడ్నాప్ చేసి ఆ భూమిని దగ్గించుకోవాలని కొండారెడ్డి గ్యాంగ్ ప్లాన్ వేసింది.

కోట్ల రూపాయల విలువ చేసే భూవివాదం:
కడప జిల్లా ప్రొద్దుటూరులో అగస్తేశ్వర దేవస్థానానికి చెందిన 18 ఎకరాల భూమి ఉంది. 50 ఏళ్ల కిందట దేవరశెట్టి దంపతులు ఓ ట్రస్ట్ పేరిట ఆ భూమిని కొనుగోలు చేసి కళాశాలను ఏర్పాటు చేశారు. అందులో మిగిలిన 11 ఎకరాల భూమిని అమ్మేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులతో కలిసి వైఎస్సార్ ను కలిశారు.

అయితే భూమిని అమ్మేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో భూమి విక్రయానికి అనుమతులు లభించాయి. 11 ఎకరాల భూమిని 6.97 కోట్లకు ట్రస్ట్ సభ్యులు అమ్మేశారు. ఆ సమయంలో ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన శివగణేశ్‌.. ఎకరం భూమిని ఎమ్మెల్యే ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

రెండున్నర ఎకరాలు డిమాండ్ చేసిన కొండారెడ్డి:
అయితే ఇప్పుడు ఆ స్థలం విషయంలో శివగణేశ్.. వరదరాజులు కొడుకు కొండారెడ్డి మధ్య వివాదం నడుస్తోంది. తమకు రెండున్నర ఎకరాలు ఇవ్వాలంటూ కొండారెడ్డి డిమాండ్ చేశాడు. దీంతో నిన్న(అక్టోబర్ 6,2020) ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కొండారెడ్డి, అతని అనుచరులు మాట్లాడుకుందామని పిలిచి శివగణేశ్‌ను బలవంతంగా తీసుకెళ్లిపోయారు.