East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. నలుగురు యువకులు మృతి

తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంకుగురై నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. నలుగురు యువకులు మృతి

Electric shock

Updated On : November 4, 2024 / 6:40 AM IST

East Godavari District: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంకుగురై నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా ఐదుగురు వ్యక్తులు విద్యుదాఘాతంకు గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఈ విషాద ఘటనలో మృతులు బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.