ఓ జిల్లా బడ్జెట్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులు రూ.2వేల కోట్లు
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(SIT) తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు, 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదు ఉంది. ఈ ఆస్తులన్నీ కోర్టు అధీనంలోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. నయీమ్ పై 251 కేసులు నమోదయ్యాయని, వీటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వెల్లడించింది. ఇంకా 60 కేసులు కొలిక్కిరావాల్సి ఉందన్నారు. 2 నెలల్లో కేసును క్లోజ్ చేస్తామని సిట్ తెలిపింది.
గ్యాంగ్ స్టర్ నయీమ్ భారీగా సెటిల్ మెంట్లు చేశాడు. కొందరిని బెదిరించి ఆస్తులు, భూములు లాక్కున్నాడు. నయీమ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నయీమ్ ఆగడాలు మితిమీరాయి. ఏకంగా అధికార పార్టీకి చెందిన నాయకులనే బెదిరించాడు. దీన్ని సీనియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. నయీమ్ సంగతి తేల్చాలని పోలీసులను ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గర మిలీనియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్ పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. 2016 ఆగస్ట్ 8న నయీమ్ ను హతమార్చారు. ఆ తర్వాత అతడికి సంబంధించిన ఇళ్లు, డెన్‌లలో సోదాలు చేయగా పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు దొరికాయి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కూడా దొరికినట్టు ప్రచారం జరిగింది.
నయీం బాధితుల్లో చాలా మంది పెద్ద వాళ్లు, ప్రముఖులు ఉన్నారని పోలీసుల విచారణలో తెలిసింది. నయీమ్ వెనుక రాజకీయ నాయకులు, పోలీస్ బాస్ ల హస్తం ఉన్నట్టు గుర్తించారు. నయీమ్ కేసులో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. నయీమ్ ఆస్తులు ఎన్ని? ఎక్కడెక్కడ ఉన్నాయి? అనేది ఎంక్వైరీ చేశారు. నయీమ్ కేసును దర్యాప్తు చేసిన సిట్.. ఆస్తుల పత్రాలను లెక్కించింది. నయీమ్ ఆస్తుల విలువ రూ.2వేల కోట్లుగా తేలడం సంచలనంగా మారింది.