Guntur : ఒక్కడే వచ్చాడు..తల్లీ కూతుళ్లను పొడిచి పొడిచి చంపేశాడు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.

Guntur : ఒక్కడే వచ్చాడు..తల్లీ కూతుళ్లను పొడిచి పొడిచి చంపేశాడు

Guntur

Updated On : August 28, 2021 / 9:57 PM IST

Mother, Daughter Murder : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. సొంత బంధువే.. ఈ దారుణానికి తెగబడ్డట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సత్తెనపల్లిలోని నాగార్జుననగర్‌లో నివాసముంటున్న తల్లీకూతురును పొడిచి చంపాడు దుండగుడు. బిల్డింగ్‌లోని రెండో ఫ్లోర్‌లోకి వెళ్లిన నిందితుడు.. తల్లీకూతుళ్లను దారుణంగా పొడిచి పొడిచి చంపారు.

Read More : MHA : మూడో దశ, పండుగల సీజన్..అప్రమత్తంగా ఉండండి

కత్తితో మహిళలపై విరుచుకుపడ్డ దుండగుడు.. ప్రతిఘటిస్తున్నా.. పద్మావతి, ఆమె కూతురు ప్రత్యూషను దారుణమంతా పొడిచి హత్య చేశాడు. పద్మావతి సోదరుడే.. మహిళలను హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఆస్తి, పొలం తగాదాలతోనే జంట హత్యలు జరిగినట్లు భావిస్తున్నారు.
ఒక్కడే వచ్చాడు.. సరాసరి బిల్డింగ్‌లోని రెండో అంతస్తులోకి వెళ్లిపోయాడు.. అక్కడే ఉన్న తల్లీకూతుళ్లపై కత్తితో తెగబడ్డాడు. వారి ప్రాణాలు పోయే వరకూ వారిపై కత్తితో దాడి చేశాడు.

Read More : Jio vs Airtel.. టెలికం రంగంలోకి గూగుల్‌ ఎంట్రీ?

ఇద్దరూ మహిళలే కావడం.. అడ్డుకోడానికి ఎవరూ లేకపోవడంతో.. నిందితుడి యదేచ్ఛగా రెచ్చిపోయాడు. కత్తితో వారిపై పలుమార్లు దాడి చేసిన నిందితుడు.. అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్ని కెమెరాల్లో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడి కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు మృతులకు తెలిసిన వాడేనని నిర్ధారించిన పోలీసులు… ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? భూమి వివాదాలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా..? హత్యకు కారణాలేంటనే దానిపై ముమ్మరంగా విచారిస్తున్నారు.