MIM Leader Syed Kashaf : ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్.. చంచల్‌గూడ జైలుకి తరలింపు

ఎంఐఎం నేత సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ బుక్ చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.

MIM Leader Syed Kashaf : ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్.. చంచల్‌గూడ జైలుకి తరలింపు

Updated On : August 30, 2022 / 5:39 PM IST

MIM Leader Syed Kashaf : ఎంఐఎం నేత సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ బుక్ చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ తర్వాత కషఫ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశాడు. పదే పదే సోషల్ మీడియాలో తన వీడియోలను పోస్ట్ చేయడంతో పాటుగా ఈ నెల 22, 23 తేదీల్లో జరిగిన నిరసన కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించాడు.

అయితే కషఫ్ పై నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేసులు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖలు చేశారంటూ ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ బుక్ చేశారు పోలీసులు.

రాజాసింగ్ వీడియోను చూపిస్తూ సయ్యద్ కషఫ్ కూడా రెచ్చిపోయాడు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. దీని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద సయ్యద్ పై కేసులు నమోదు చేశారు. అలాగే పీడీ యాక్ట్ బుక్ చేశారు.