Anantapur Murder : అనంతపురంలో భవన నిర్మాణ కార్మికుడి హత్య

అనంతపురం నగర శివారులో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Anantapur Murder : అనంతపురంలో భవన నిర్మాణ కార్మికుడి హత్య

Anantapuram Murder

Updated On : June 26, 2021 / 6:06 PM IST

Anantapur Murder : అనంతపురం నగర శివారులో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతి చెందిన వ్యక్తిని యల్లప్పగా గుర్తించారు. టీవీటవర్ సమీపంలో నివాసముండే యల్లప్ప బేల్దార్ పని చేసుకుంటూ జీవినం సాగిస్తుంటాడు. అయితే చాలా రోజుల క్రితం భార్య, పిల్లల్ని వదిలేసి బాలసదన్‌లో పనిచేసే మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

నిన్న పనికి వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే గత రాత్రి పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు మోహంపై రాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మద్యం మత్తులో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ హత్యపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.