Suzuki Hayabusa superbike Ride : ధూమ్.. సుజుకీ Hayabusa సూపర్ బైక్.. సరదాగా రైడ్ చేసిన పోలీసులు

సూపర్ బైకులంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పబ్లిక్ మాత్రమే కాదు.. పోలీసులు కూడా సూపర్ బైకులను ముచ్చటపడుతున్నారు. రోడ్లపై ర‌య్యిమంటూ దూసుకెళ్లే పెద్ద బైక్‌లను రైడ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

Suzuki Hayabusa superbike Ride : ధూమ్.. సుజుకీ Hayabusa సూపర్ బైక్.. సరదాగా రైడ్ చేసిన పోలీసులు

Suzuki Hayabusa superbike Ride

Updated On : March 16, 2021 / 4:47 PM IST

Cops Ride Suzuki Hayabusa superbike : సూపర్ బైకులంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పబ్లిక్ మాత్రమే కాదు.. పోలీసులు కూడా సూపర్ బైకులను చూసి ముచ్చటపడుతున్నారు. రోడ్లపై ర‌య్యిమంటూ దూసుకెళ్లే పెద్ద బైక్‌లను రైడ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. రోడ్లపై రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగా ఆపిన ఓ సూపర్ బైక్ ను చూడగానే పోలీసులకు ముచ్చటేసింది.

ఇలాంటి ఖరీదైన లగ్జరీ బైక్ ఒకసారైనా రైడ్ చేయాలనిపించింది మహారాష్ట్రకు చెందిన పోలీసులకు. సుజూకీ హయాబుశా సూపర్ బైక్‌పై సరదాగా రైడ్ చేసి పోలీసులు ముచ్చట తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి ఒకరు రెడ్ కలర్ సుజూకీ హయాబుశా పెద్ద బైక్ రైడ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై తీర ప్రాంతానికి సమీపంలో జరిగింది. ఇంతకీ సూపర్ బైక్ ఎలా నడపాలో ఓనర్ ద్వారా తెలుసుకుని మరి రైడింగ్ చేశారు.

పోలీసుల్లో ఒకరు Suzuki Hayabusa రైడింగ్ చేస్తుంటే మరొకరు వీడియో రికార్డు చేశారు. అయితే ఈ సూపర్ బైక్ ఎవరిది అనేది ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగా పోలీసులు ఈ బైకును ఆపారు. సూపర్ బైకును చూడగానే ముచ్చటేసిన పోలీసులు షార్ట్ రైడ్ ప్లీజ్ అంటూ సరదాగా రైడింగ్ చేశారు. భారత మార్కెట్లో సుజూకీ Hayabusa అత్యంత ఖరీదైన లగ్జరీ బైక్. ధూమ్ మూవీ తర్వాత ఈ తరహా బైకులకు ఫుల్ క్రేజ్ పెరిగింది. Hayabusa బైక్ మాత్రమే కాదు.. అన్ని ఇతర సూపర్ బైకులు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.