Murder Attempt : కడప జిల్లాలో టీడీపీ మద్దతుదారులపై దాడి
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి మండలం, గొర్లముదివేడు గ్రామం వల్లూరువాండ్లపల్లిలో గత రాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు.

Murder Attempt In Kadapa District
Murder Attempt : రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి మండలం, గొర్లముదివేడు గ్రామం వల్లూరువాండ్లపల్లిలో గత రాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేశామన్న కారణంతోనే తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు.
గ్రామ వాలంటీర్‌తో సహా 8 మంది తమపై దాడి చేసారని బాధితులు తెలిపారు. దాడిలో మహదేవపల్లి నరసింహారెడ్డి, నిర్మలమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.