ఆ మూఢ నమ్మకమే చంపేసింది : డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు

సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 06:56 AM IST
ఆ మూఢ నమ్మకమే చంపేసింది : డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు

Updated On : September 3, 2019 / 6:56 AM IST

సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకి రైస్ పుల్లింగ్ ముఠా చేసిన మోసమే కారణం అని తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తుల ఘరానా మోసం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుందని పోలీసులు చెబుతున్నారు. మూఢ నమ్మకం ఆ కుటుంబాన్ని బలి తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అమలాపురంలోని శ్రీకృష్ణా ఆర్థో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత రామకృష్ణంరాజు కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. అప్పుల నుంచి బయటపడేందుకు రైస్‌ పుల్లింగ్ ముఠాని ఆశ్రయించారు డాక్టర్ రామకృష్ణం రాజు. వారు చెప్పింది నమ్మిన డాక్టర్ కుటుంబం భారీగా నష్టపోయింది. దీన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు విచారణలో తేలింది.

రూ.5 కోట్ల మేర డాక్టర్ కుటుంబాన్ని మోసం చేసిన మాయగాళ్లలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకట వేణుధర ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురితో ముఠాగా ఏర్పడిన ప్రసాద్… డాక్టర్‌ రామకృష్ణరాజు కుటుంబాన్ని ట్రాప్ చేశాడు. రైస్‌ పుల్లింగ్‌ యంత్రంతో సిరి సంపదలు వస్తాయని నమ్మించారు. రూ.5కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ తర్వాత మాయమైపోయారు.

డాక్టర్‌ కుటుంబం వీరిని ఎన్నిసార్లు కలిసినా డబ్బులు ఇవ్వకపోగా బెదిరించినట్లు తెలుస్తోంది. రామకృష్ణంరాజు తమ మరణానికి ముందు చిన్న కుమారుడికి ఈ విషయాన్ని ఫోన్‌ చేసి చెప్పాడని, ఇంటికి వస్తే అందరం కలసి చనిపోదామన్నారని.. వంశీకృష్ణ వచ్చేలోపే మిగిలిన ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.