సర్పంచ్‌ల దగ్గర అక్రమ వసూళ్లు : నకిలీ అఘోరాలు అరెస్టు   

సర్పంచ్‌ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ అఘోరాలను గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:28 PM IST
సర్పంచ్‌ల దగ్గర అక్రమ వసూళ్లు : నకిలీ అఘోరాలు అరెస్టు   

సర్పంచ్‌ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ అఘోరాలను గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ : సర్పంచ్‌ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ అఘోరాలను గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యూపీకి చెందిన ముఠాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

కొన్ని రోజులుగా అఘోరాలు తిరుగుతున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లాలో అఘోరాలు కనబడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనంలో ఒకతను బట్టలు లేకుండా.. మరో ఇద్దరు కాషాయ దుస్తులు ధరించి తిరిగారు. రామడుగు, గంగాధర మండలాల్లో వీరు తిరుగుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను వీరు టార్గెట్ చేశారు. సర్పంచ్‌‌ ఇళ్లు ఎక్కడా ? అంటూ ఆరా తీస్తున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీరి బారిన పడిన కొంతమంది సర్పంచ్‌లు మోసపోయారు. తమ దగ్గరకు వచ్చి మంచి జరగాలంటే డబ్బులు ఇవ్వాలని.. రూ.500 ఇస్తే తీసుకోలేదని..రూ. 3వేలు ఇస్తే వెళ్లారని ఓ సర్పంచ్ చెప్పుకొచ్చాడు. అఘోరాలపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. నకిలీ అఘోరాలను గంగాధర పోలీసులు అరెస్టు చేశారు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.