Karnataka: పశువుల వ్యాపారిని కిరాతకంగా చంపిన గోరక్షుడు పునీత్ అరెస్ట్

పశువులను రవాణా చేస్తున్న ఇంద్రీస్ పాషా అనే వ్యాపారి మీద అనుచిత ఆరోపణలు మోపి.. పునీత్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అతడు, అతని బృందం పరారీ అయ్యారు. వీరి మధ్య హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు..

Karnataka: పశువుల వ్యాపారిని కిరాతకంగా చంపిన గోరక్షుడు పునీత్ అరెస్ట్

Puneeth Kerehalli

Updated On : April 5, 2023 / 6:16 PM IST

Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో పశువుల వ్యాపారిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు, రైట్ వింగ్ కార్యకర్త పునీత్ కెరెహల్లిని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాజస్థాన్‌లో దాక్కున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన కర్ణాటక పోలీసులు పునీత్ సహా మరో నలుగురిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేరెహళ్లి ‘రాష్ట్ర రక్షణ పదే’ (నేషన్ ప్రొటెక్షన్ ఆర్మీ) అనే రైట్ వింగ్ గ్రూపును పునిత్ నడుపుతున్నాడు.

Delhi Metro Bikini Girl : మెట్రోలో బికినీలో యువతి.. తీవ్ర విమర్శలకు ఘాటుగా రిప్లయ్, డోంట్ కేర్ అంటూ ఎదురుదాడి

ఇక గతంలో పునీత్ మీద అనేక దాడులు, అల్లర్లు, కిడ్నాపులు వంటి వాటి మీద కేసులు నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. హలాల్ మాంసానికి వ్యతిరేకంగా పునీత్ నిర్వహించిన ప్రచారాలపై కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఇక హిందూ దేవాలయాల జాతరలలో ముస్లిం వ్యాపారులను నిషేధించాలని సైతం పునీత్ డిమాండ్లు చేశాడు.

Karnataka Polls: బీజేపీకి కన్నడ హీరో సుదీప్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే

పశువులను రవాణా చేస్తున్న ఇంద్రీస్ పాషా అనే వ్యాపారి మీద అనుచిత ఆరోపణలు మోపి.. పునీత్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అతడు, అతని బృందం పరారీ అయ్యారు. వీరి మధ్య హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజస్థాన్ రాష్ట్రంలో తిరుగుతున్నారని తెలుసుకుని, అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అనంతరం వీరి మీద భారతీయ శిక్షాస్మృతిలోని 302 (హత్య), 323 (దాడి) 341 (తప్పుడు నిర్బంధం), 506 (నేరపూరిత బెదిరింపు), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.