షాద్‌నగర్‌లో తిరగబడ్డ జనాలు : పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం..ఉద్రిక్తత

శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..దారుణ హత్యపై షాద్ నగర్ వాసులు భగ్గుమన్నారు. ప్రియాంక హత్య తర్వాత కేసు విషయంలో..ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి..ఆవేదనకు..ఆక్రోషానికి దర్పణం పడుతోంది. నిందితులను తమకు అప్పగించాలని, లేకపోతే పీఎస్ ఎదుటే ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఆందోళనకారులను అడ్డుకొనేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నం జరుగుతుండడంతో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు శాంతింప చేస్తున్నా..ఎవరూ వినడం లేదు. నిందితులను తమకు అప్పగించాలని యువత డిమాండ్ చేస్తోంది. ఉరి శిక్ష వేయాలని..ఇది బహిరంగంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
2019, నవంబర్ 30వ తేదీ శనివారం షాద్ నగర్ పీఎస్‌కు నలుగురు నిందితులను తీసుకొచ్చారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున స్థానికులు మోహరించారు. నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వేలాదిగా ఉన్న వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. మొత్తంగా షాద్ నగర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Read More : ప్రియాంక ఫ్యామిలినీ చూస్తే గుండె కరిగిపోయింది – ఆలీ