బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య

బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్య

Updated On : January 26, 2021 / 3:37 PM IST

rowdy sheeter Feroz brutally murdered in borabanda : హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి అతని ఇంటి సమీపంలోనే కత్తులతో దాడి చేసి కిరాతకంగా  హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఫిరోజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. వాహీద్ అనే రౌడీ షీటర్ తో ఉన్న పాత కక్షల నేపధ్యంలోనే  హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు,