బంగారమైపోయింది : 10 లారీల ఇసుక చోరీ
ఏపీలో ఇసుక బంగారమైపోయింది అంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇసుకకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఏకంగా దొంగతనాలకు

ఏపీలో ఇసుక బంగారమైపోయింది అంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇసుకకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఏకంగా దొంగతనాలకు
ఏపీలో ఇసుక బంగారమైపోయింది అంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇసుకకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఏకంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇసుక కనిపిస్తే చాలు ఎత్తుకెళుతున్నారు. అవును.. ఏపీలో ఇసుక దొంగలు తయారయ్యారు. ఇసుకను ఎత్తుకుపోతున్నారు. చిత్తూరు జిల్లా గుండ్లూరు స్టాక్ పాయింట్ నుంచి ఇసుక దొంగతనం చేశారు. ఏకంగా 10 లారీల ఇసుక ఎత్తుకుపోయారు.
స్టాక్ పాయింట్ దగ్గర నలుగురు ఉద్యోగులు కాపలా ఉన్నా.. ఇసుక మాయమైంది. కాగా దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాంట్రాక్టర్ల పనే అనే అధికారులు సందేహిస్తునన్నారు. కాంట్రాక్టర్లే ఇసుక చోరీకి పాల్పడినట్టు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
ఏపీలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా లేదు. దీంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరత రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.
చంద్రబాబు, పవన్ దీక్షలు, ధర్నాలు కూడా చేశారు. ప్రభుత్వం మాత్రం వరదల కారణంగా ఇసుక సమస్య వచ్చిందని, సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఇసుకను చోరీ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇసుక చోరీ ఘటనలు సంచలనంగా మారాయి.