బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ

ఇప్పటిదాక బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇతర రకాల వస్తువులు చోరీకి గురవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దేశంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. చోరీలు చేసే వ్యక్తుల కన్ను ఇప్పుడు బంగారం, వాహనాలు, ఇతర విలువైన వస్తువులపై కాకుండా..ఓ వస్తువుపై పడింది. అదే..ఉల్లిగడ్డలు. అవును ఇప్పుడు దేశంలో ఉల్లిపాయల దొంగలు పెరిగారు. ఉల్లిగడ్డలు బంగారం అయిపోయాయి.
కిలో రూ. 100 పలుకుతూ..కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. దీంతో ఉల్లిగడ్డలను దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో రూ. 50 వేల బస్తాల ఉల్లిగడ్డలను దొంగతనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో అక్షయ్ దాస్ అనే వ్యాపారికి సుతహత ప్రాంతం వద్ద దుకాణం ఉంది. నవంబర్ 26వ తేదీ మంగళవారం ఎప్పటిలాగే దుకాణాన్ని తెరిచాడు. కానీ షాపులో వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. దీంతో చోరీ జరిగిందని గ్రహించాడు. వెంటనే క్యాష్ బాక్స్ తెరిచి చూడగా..నగదు మాత్రం ఉంది. పక్కనే ఉన్న ఉల్లిగడ్డల బస్తాలు కనిపించలేదు. దీంతో వ్యాపారి..పోలీసులకు కంప్లయింట్ చేశాడు. రూ. 50 వేల విలువ ఉంటుందని వ్యాపారి వెల్లడించాడు.
Read More : గాడ్సే ఎఫెక్ట్ : రక్షణశాఖ సంప్రదింపుల కమిటీ నుంచి బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ అవుట్