అమ్మమ్మ వాళ్ల ఇంటికెళుతూ… తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మ‌ర‌ణం

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 11:48 AM IST
అమ్మమ్మ వాళ్ల ఇంటికెళుతూ… తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మ‌ర‌ణం

Updated On : April 20, 2019 / 11:48 AM IST

వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. 
Also Read : నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో సింగారపు అనీల్ నివాసం ఉంటున్నాడు. పోతురాజుపల్లిలో ఇతని మేనకోడలు..ఆమె కూతుళ్లు జాహ్నవి, సాత్వికలు ఉంటున్నారు. వేసవి సెలవలు కావడంతో వారిని తీసుకొచ్చేందుకు ఏప్రిల్ 20వ తేదీ శనివారం పొతరాజుపల్లికి బైక్‌పై అనీల్ వెళ్లాడు. వారిని బైక్‌పై కూర్చొబెట్టుకుని జల్లి గ్రామానికి తీసుకొస్తున్నాడు. 

మార్గమధ్యంలో కొమ్మాల నర్సింహ స్వామి ఆలయం ఉంది. స్వామి వారిని దర్శించుకున్న వీరు..తిరిగి బయలుదేరారు. కొమ్మాల స్టేజీ వద్ద వేగంగా వచ్చిన కారు బైక్‌ని ఢీకొంది. ఈ ఘటనలో మేన కోడలు, చిన్నారులు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. తీవ్రగాయాలపాలైన సింగారపు అనీల్‌ని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. గీసుకొండ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 
Also Read : వీడియో వైరల్: రాంగ్‌రూట్‌లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..