Horrific Racist Attack: ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారంటూ యువతి జాత్యహంకార వ్యాఖ్యలు.. వీడియో

టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆ మెక్సికన్-అమెరికన్ యువతి పలు వ్యాఖ్యలు చేసింది. భారతీయులు అంటే తనకు ద్వేషమని, మంచి జీవితాన్ని గడపడానికే భారతీయులు అమెరికాకు వస్తారని ఆమె అంది. ఆ మెక్సికన్-అమెరికన్ పేరు ఎస్మెరాల్డా అప్టన్ గా పోలీసులు గుర్తించారు.

Horrific Racist Attack: ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారంటూ యువతి జాత్యహంకార వ్యాఖ్యలు.. వీడియో

Horrific Racist Attack

Updated On : August 26, 2022 / 11:09 AM IST

Horrific Racist Attack: అమెరికాలో మరోసారి జాత్యహంకార ఘటన చోటుచేసుకుంది. నలుగురు భారతీయ అమెరికన్ మహిళలను తిడుతూ ఓ మెక్సికన్-అమెరికన్ యువతి రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చివరకు ఆ మెక్సికన్-అమెరికన్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆ మెక్సికన్-అమెరికన్ యువతి పలు వ్యాఖ్యలు చేసింది.

భారతీయులు అంటే తనకు ద్వేషమని, మంచి జీవితాన్ని గడపడానికే భారతీయులు అమెరికాకు వస్తారని ఆమె అంది. ఆ మెక్సికన్-అమెరికన్ పేరు ఎస్మెరాల్డా అప్టన్ గా పోలీసులు గుర్తించారు. ఆమె తీరును వివరిస్తూ ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ తన తల్లి మరో ముగ్గురు మహిళలతో కలిసి డిన్నర్ కు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు.

ఓ యువతి తిడుతుండగా తన తల్లి ఎదురు చెప్పకుండా మౌనంగా ఆమెను చూస్తూ ఉండిపోయిందని అన్నారు. ఆ మెక్సికన్-అమెరికన్ యువతి తాను అమెరికాలో పుట్టి పెరిగానని చెప్పుకుందని అన్నారు.


MLA Kodali Nani : జూ.ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరు, చంద్రబాబు కొత్త పార్టీ-కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు