GATE 2024 Results : గేట్-2024 ఫలితాలు విడుదల.. ఇప్పుడే చెక్ చేసుకోండి.. ఈ నెల 23న స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్!

GATE 2024 Results : ఐఐఎస్‌సీ బెంగుళూరు గేట్ 2024 ఫలితాలను ప్రకటించింది. గేట్ రిజల్ట్స్ చెక్ చేయడానికి (gate2024.iisc.ac.in) వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.అభ్యర్థులు గేట్ 2024 లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి.

GATE 2024 Results : గేట్-2024 ఫలితాలు విడుదల.. ఇప్పుడే చెక్ చేసుకోండి.. ఈ నెల 23న స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్!

GATE 2024 Results Announced, Check Details

GATE 2024 Results : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2024) ఫలితాలను శనివారం (మార్చి 16న) ప్రకటించింది. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐఐఎస్‌సీ అధికారిక (gate2024.iisc.ac.in) వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

గేట్ రిజల్ట్స్ స్కోర్‌కార్డ్‌లు మార్చి 23, 2024 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (GOAPS) పోర్టల్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి నేరుగా జీఓఏపీఎస్ ద్వారా లాగిన్ చేయవచ్చు.

Read Also : CTET 2024 Registrations : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష పూర్తి వివరాలివే!

ఐఐఎస్‌సీ బెంగళూరు గేట్ 2024 ఫలితాలతో పాటు సబ్జెక్ట్ వారీగా కట్-ఆఫ్ మార్కులను కూడా ప్రకటిస్తుంది. ఈ కటాఫ్‌లను అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, డైరెక్ట్ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్ పొందవచ్చు.

విద్యా మంత్రిత్వ శాఖ (MoE), ఇతర ప్రభుత్వ ఏజెన్సీల మద్దతు ఉన్న సంస్థలలో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ సంబంధిత శాఖలలో డాక్టరల్ ప్రోగ్రామ్‌లలో చేరవచ్చు. ఎంటెక్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2024) పరీక్ష ఫిబ్రవరి 3,4,10, 11 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు.

గేట్ 2024 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? :

  • గేట్ ‘GATE-2024’ ఫలితాల కోసం (gate2024.iisc.ac.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
  • GATE 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి
  • ‘Submit’పై క్లిక్ చేయండి.
  • స్కోర్‌లతో సహా గేట్ రిజల్ట్స్ 2024 స్క్రీన్‌పై చూడవచ్చు.

మార్చి 23 నాటికి గేట్ స్కోర్‌కార్డ్‌ను విడుదల చేస్తుంది. గేట్ 2024 స్కోర్‌కార్డ్‌కు గేట్ ఫలితాల తేదీ నుంచి మూడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంటుంది.

Read Also : TS TET 2024 : గుడ్ న్యూస్.. ‘టెట్’ నోటిఫికేషన్ విడుదల.. డీఎస్సీ పరీక్ష తేదీలు కూడా..!